నాసా ఛాలెంజ్‌కు ఎంపికైన తెలంగాణ విద్యార్థి బృందం

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 02:38 PM
 

హైదరాబాద్: నాసా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హ్యుమన్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్‌కు తెలంగాణ విద్యార్థి బృందం ఎంపికైంది. చంద్రుని ఉపరితలంపై ప్రయాణించే బగ్గీ వాహనాన్ని తయారుచేసే ఈ పోటీకి వరంగల్‌లోని ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థుల బృందం ఎంపికైంది. యూఎస్‌లోని అలబామాలో గల హంట్స్‌విలేలో ఏప్రిల్-2018లో జరిగే ఐదో వార్షిక ఛాలెంజ్ కార్యక్రమంలో విద్యార్థుల బృందం పాల్గొననుంది. దేశవ్యాప్తంగా ఏంపికైన నాలుగు టీంలలో తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజీ బృందం ఒకటి. 23 దేశాలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.