60 గ్రామాలకు నీరందించే ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 05:55 PM
 

సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం చందుపట్ల గ్రామంలో మిషన్ భగీరథలో భాగంగా నిర్మించిన.. 60 గ్రామాలకు తాగు నీటిని అందించే ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అంతకు ముందు చివ్వెంల మండలం పట్టికాపాడు సమీపంలో ఉన్న 400 కేవీ సబ్ స్టేషన్‌ను సీఎం ప్రారంభించారు. కుడకుడలో నూతన కలెక్టరేట్ భవన సముదాయం, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు సీఎం భూమి పూజ నిర్వహించారు.