బెంగళూరు సెంట్రల్ జైలుకు చేరుకున్న శశికళ

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 06:13 PM
 

బెంగళూరు: ఐదు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన ఎఐఎడిఎంకె బహిష్కృత నాయకురాలు శశికళ తిరిగి బెంగళూరు సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. భర్త నటరాజన్‌ అనారోగ్యం కారణంగా పెరోల్‌ మంజూరు చేయాలని ఆమె చేసుకున్న దరఖాస్తుకు జైళ్ల శాఖ 5 రోజుల పెరోల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. గడువు నిన్నటితో ముగిసిపోవడంతో నేడు ఆమె తిరిగి జైలుకు తిరిగి చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం విధితమే.