జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 06:38 PM
 

హైదరాబాద్: సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతుంది. హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, కవాడీగూడ, ముషీరాబాద్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తుండగా కుత్బుల్లాపూర్, ఐడీపీఎల్, జీడిమెట్ల, చింతల్, సూరారం, సుచిత్ర తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం పడుతుంది.