సచివాలయం ప్రాంగణం నుంచి ఢిల్లీ సీఎం కారు చోరీ

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 06:55 PM
 

ఢిల్లీలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బ్లూ వేగాన్ కారు చోరీకి గురైంది. ఒక ముఖ్య‌మంత్రి కారు అది కూడా ఢిల్లీలోన స‌చివాల‌యం ప్రాంగ‌ణంలోనే ఈ కారు చోరీ కావ‌డంతో అల‌జ‌డి చెల‌రేగింది. ఈ ఘ‌ట‌ప‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసుకున్న పోలీసులు కారు కోసం గాలించే ప‌నిలో ప‌డ్డారు. ఆ కారుని ప్ర‌స్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాలంటీర్లు ఉప‌యోగిస్తున్నార‌ని తెలిసింది. ఈ రోజు 2 గంట‌ల ప్రాంతంలో ఆ కారును గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చోరీ చేశాడ‌ని స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది.