ఆదిలాబాద్ జిల్లా బాసరకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం పంచమి రోజు కావడంతో తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో బాసరకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆ తర్వాత తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు మొదలు కావడం, ఇతర తరగతుల పరీక్షలు త్వరలో ఉండటంతో విద్యార్థులు అమ్మవారి దర్శనానికై బారులు తీరారు. భక్తుల రాకతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. దీంతో అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa