ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే అత్యుత్తమైన బ్యాట్స్‌మన్‌ కోహ్లీకి బంతులేయడం చాలా కష్టం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 16, 2017, 07:39 PM

ముంబయి: పటిష్ఠ బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న కోహ్లీసేనను కట్టడి చేయడం కష్టమేనని న్యూజిలాండ్‌ బౌలర్‌ మిచెల్‌ శాంట్నర్‌ అన్నారు. త్వరత్వరగా బంతులు విసిరి బ్యాట్స్‌మెన్‌ను పొరపాట్లు చేయించడంలోనే విజయం దాగుందని పేర్కొన్నారు. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్‌ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.


‘టీమిండియాకు బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. స్పిన్‌ను అద్భుతంగా ఆడగలరు. వారు అందులోనే పుట్టి పెరిగారు. నేను సింపుల్‌గా బౌలింగ్‌ చేయడానికే ప్రయత్నిస్తా. సరైన ప్రాంతంలో బంతిని త్వరగా విసిరి బ్యాట్స్‌మన్‌ పొరపాటు చేసేలా చేస్తా. అలా బంతులు వృథాచేసి ఒత్తిడి పెంచితే వికెట్లు తీయడం సులభమే. నేనదే చేయబోతున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమైన బ్యాట్స్‌మన్‌ కోహ్లీకి బంతులేయడం చాలా కష్టం. అతడే కాదు జట్టంతా అలాగే ఉంది. ఆస్ట్రేలియాపై వారు చక్కగా ఆడారు. గతసారి ఇక్కడ బాగానే ఆడాం. ఇప్పుడూ అలాంటి మంచి ప్రదర్శనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఉపఖండంలో నాకున్న అనుభవం ఉపయోగించి బౌలింగ్‌ చేస్తా’ అని శాంట్నర్‌ అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com