గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరంగల్ రూరల్ జిల్లాలోని విలీన గ్రామాల రోడ్లను వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, గ్రేటర్ వరంగల్ కమిషనర్ శృతి ఓజా పరిశీలించారు. వీరితో పాటు పర్కాల ఎమ్మెల్యే చల్లా దర్మా రెడ్డి రోడ్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా వరంగల్ నుంచి టెక్స్టైల్ పార్కు వరకు ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు ఈ సందర్భంగా వాళ్లు నిర్ణయం తీసుకున్నారు.