ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోహ్లీకి అవకాశం ఇస్తే మ్యాచ్‌ను లాగేసుకుంటాడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 20, 2017, 03:29 PM

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి అవకాశం ఇస్తే చాలు మ్యాచ్‌ విజయాన్ని లాగేసుకుంటాడని పాక్‌ బౌలర్‌ మహమ్మద్‌ ఆమిర్‌ అన్నాడు. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌తో కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్న కోహ్లీ ‘తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో ఆమిర్‌ ఒకడు’ అని చెప్పిన సంగతి తెలిసిందే.


తాజాగా కోహ్లీ కామెంట్స్‌పై పాక్‌ బౌలర్‌ ఆమిర్‌ స్పందించాడు. ‘కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్‌ అని ప్రపంచానికి తెలుసు. అలాంటి బ్యాట్స్‌మెన్‌కు బంతులేయాలంటే మనమూ అత్యున్నత ప్రదర్శన కనబరచాల్సిందే. అతనికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా ఇక అంతే.. మ్యాచ్‌ను లాగేసుకుంటాడు. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తాడు. ఢాకాలో ఆసియా కప్‌లో మాపై అదే జరిగింది. అందుకే కోహ్లీకి బంతులేసేటప్పుడు నా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తా. లక్ష్య ఛేదనలో అతని స్ట్రైక్‌ రేట్‌ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అతను నా బౌలింగ్‌ను ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. కోల్‌కతాలో కోహ్లీ తన బ్యాట్‌ను నాకు కానుకగా అందించడం ఎప్పటికీ మర్చిపోలేను’ అని ఆమిర్‌ తెలిపాడు. ఈ ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ.. ఆమిర్‌ బౌలింగ్‌లోనే ఔటైన సంగతి తెలిసిందే.


ప్రస్తుతం కోహ్లీ.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ నెల 22 నుంచి కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com