ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ఇంజనీర్ల దినోత్సవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2017, 02:36 AM

-త్వరలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్‌ పూర్తి
-త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
-రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సహకరించాలి
-జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

 విజయవాడ, సూర్య బ్యూరో : గ్రామాల్లోని రైతు అందరికన్నా పెద్ద ఇంజనీర్‌ అని, వారి ఆలోచనలు, అనుభవాలను ఉపయోగించుకుని చెరువులు, కాలువ లలోని పూడికలు తీయడానికి వారి సలహాలు, సూచనలు తీసుకోని ఆయు కట్టుకు నీరు అందించడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఆధికారులపై ఉందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రఖ్యాత ఇంజనీర్‌ డాక్టర్‌ కె. శ్రీరామకృష్ణయ్య జన్మదినం సందర్భంగా ప్రతి యేటా జల వనరులశాఖ ఆధ్వర్యంలో జరిపే ఇంజనీర్ల దినోత్సవం శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షే్త్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్ధులు తరగతి క్లాసులలో నేర్చుకునే దానికన్నా ప్రాక్టికల్‌గా ప్రాజెక్టులు నిర్మించే ప్రాంతాన్ని ప్రత్యక్షంగా చూస్తే చాలా అనుభ వం వస్తుందని, ఇది వారి ప్రాజెక్టువర్‌‌కకు ఉపయోగపడుతుందని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతాన్ని ఇంజనీరింగ్‌ విద్యార్థు లు సందర్శించాల్సిన అవసరం ఉందని వారికి సూచించారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్‌ పూర్తవుతుందని తెలిపారు. గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఇది పూర్తయితే దేశంలోనే నదుల అనుసంధాన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవిర్భవిస్తుందన్నారు. రాబోయే 3 నెలలు ఆధికారులు రాష్ట్రంలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందుకు  పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, ఎలక్ట్రికల్‌, ఇరిగేషన్‌ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారన్నారు. త్రాగు, సాగు నీటి ప్రాజెక్టుల ద్వారా పరిశ్రమ లకు కావలసిన నీటి సదుపాయాన్ని అందించాల్సిన బాధ్యత జలవనరుల శాఖ పైనే ఉందన్నారు. ఈ వేసవిలో ఎండవేడిమి ఎక్కువ ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఇంజనీర్‌ శ్రీరామకృష్ణయ్య రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించడంలో తీసుకున్న శ్రద్ధను స్పూర్తిగా తీసుకుని, ఇంజనీర్లంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. మూడు ప్రాంతాల నుంచి కార్యక్రమానికి హాజరైన ఇంజనీర్లు శ్రీరామకృష్ణయ్య లాంటి వారి స్ధాయికి చేరుకోవాలన్నారు. గ్రామాల్లో గొలుసుకట్టు చెరువులు ఏ విధంగా కలపొచ్చో ఆలోచించాల్సిన అవసరం స్ధానిక ఆధికారులపై ఉందన్నారు. దీనికి విద్యార్ధులు, ఇంజనీర్లు, రైతులు, నీటి సంఘాల సభ్యులు 36 వేల మంది కలసి రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సహాకరించాలని చెప్పారు. 15వ ఇంజనీర్‌‌స దినోత్సవానికి హాజరైన ఇంజనీర్లు, రైతులు మంత్రిని దుశ్శాలువాతో సన్నానించారు. నీటిపారుదల శాఖ సలహాదారు చెరు కూరి వీరయ్య మాట్లాడుతూ వరి పంటకు కావాలసిన నీటి లభ్యత తదితర విషయాలను రైతులకు, విద్యారు ్ధలకు వివరించారు. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక వరమని చెప్పారు. ఇరిగేషన్‌ శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగు తున్న ప్రాజెక్టుల పనితీరును విద్యార్ధులు స్వయంగా సైట్‌లో పరిశీలిస్తే అనుభవం పెరుగుతుందన్నారు. గత 30 సంవత్సరాలలో రాష్ట్రంలో ఒక్క టి.ఎం.సీ నీటిని కూడా ఆధికంగా ఇవ్వలేకపోయామని, పట్టిసీమ వల్ల గత ఏడాది 125 టి.ఎం.సీల నీళ్ళు రైతులకు అందించామని చెప్పారు. ఒక్క టి.ఎం.సీతో 10 వేల ఎకరాలకు నీటి సౌకర్యం కల్పించవచ్చన్నారు. ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం స్పిల్‌వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు సైట్‌లో జరుగుతున్న పనులను సదస్సుకు  హాజరైన సభ్యులకు, అతిధులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరించారు. తుర్లపాటి కుటుంబరావు, చెరుకూరి వీరయ్య, రౌతు సత్యనారా యణ, శ్రీనివాసరెడ్డి, కుమారి లక్షీ్మకాంతలను జలవనరుల శాఖ మంత్రి దేవి నేని ఉమామహేశ్వరరావు దుశ్శాలువాతో సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితురాలిగా వచ్చిన డాక్టర్‌ శ్రీరామకృష్ణయ్య సతీమణి గిరిజా రామకృష్ణయ్యను మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దుశ్శాలువాతో సత్కరించారు. 15వ ఇంజనీర్‌‌సడే కార్య క్రమంలో 13 జిల్లాల ఇంజనీర్లు, వాసవి ఇంజనీరింగ్‌ కాలేజి విద్యార్ధులు, ఇంజనీరింగ్‌ ఆధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నార










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa