ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా నాకు ఇష్టం..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2017, 03:09 AM

నేను సినిమాల్లో  ప్రవేశించి సుమారు ఎనిమిది సంవత్సరాలైంది. వెనక్కి తిరిగి  చూసుకుంటే సినిమాలు నన్ను బలంగా తయారు చేసాయని కమల్‌హసన్‌ కూతురు శ్రుతిహసన్‌ ఓ ఇంటర్యూలో తెలియజేసారు.  కాని గతంలో నేను నాస్నేహితులతో ఎలా గడిపానో ఇప్పుడు అలానే ఉంటున్నానన్నారు. సినిమా కెరీర్‌ మొదటలో నటించిన మూడు సినిమాలు లక్‌, అనగనగా ఓ ధీరుడు లాంటి సినిమాలు సరిగా  ఆడలేదు. తరువాత హిందీ రీమేక్‌ దబాంగ్‌ కు తెలుగులో పవన్‌ హీరోగా వచ్చిన గబ్బర్‌సింగ్‌ సినిమా సక్సెస్‌ సాధించడంతో మంచి హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది.  ఇప్పుడు కాటమరాయుడులో నటిస్తున్నానని ఇది మంచి విజయం సాధిస్తుందని నమ్మకం వెలిబుచ్చారు. రిలీజయిన సింగం3 సినిమాకు మిక్‌‌సడ్‌ రివ్యూస్‌ వచ్చాయన్నారు. సినిమాల్లోనే పూర్తిస్థాయిలో కొనసాగుతానని తెలియజేసారు శృతిహాసన్‌. ఇప్పుడు తమిళలో భారీబడ్జెట్‌ తో తెరకెక్కుతున్న సంఘమిత్రలో నటిస్తూ బిజీగా ఉన్నాననీ అన్నారు.  










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa