ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్రాంగదలో అంజలి సూపర్‌..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2017, 02:52 AM

అంజలి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం చిత్రాంగద. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించారు. అశోక్‌ దర్శకుడు. గంగపట్నం శ్రీధర్‌, రెహమాన్‌ నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ చిత్రమైన కథ ఇది. వూహకు అందని మలుపులతో సాగుతుంది. అంజలి పాత్రలో రెండు ఛాయలు కనిపిస్తాయి. కొన్ని  అదృశ్య శక్తుల వల్ల కథానాయిక జీవితం ఎలా చిక్కుల్లో పడింది? అందులోంచి తాను ఎలా బయటపడిందన్నది ఆసక్తికరం. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. అంజలి నటన ప్రధాన ఆకర్షణ. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందన్నారు. జేపీ, సప్తగిరి, రాజా రవీంద్ర,  సింధు తులానీ తదితరులు నటించారు. సంగీతం: సెల్వ గణేష్‌










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa