న్యూయార్క్: భారతీయులు చాలా విలువైన వాళ్లు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు వారిపై కాల్పులు జరగడంపై సిగ్గు పడుతున్నా అని కాన్సస్ గవర్నర్ శామ్ బ్రౌన్‌బ్యాక్ అన్నారు. కూచిబొట్ల శ్రీనివాస్ హత్యపై స్పందించిన ఆయన భారత దౌత్యవేత్తలతో సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు ఎంతో విలువనిచ్చిన కాన్సస్‌లో ఇలాంటి ఘటన జరగడం దారుణమని బ్రౌన్‌బ్యాక్ అన్నట్లు కాన్సుల్ జనరల్ అనుపమ్ రే వెల్లడించారు. ఒక్క వ్యక్తి విద్వేష చర్యతో తమపై ఓ అంచనాకు రావద్దని ఆయన అన్నారు. కాన్సస్ అనుపమ్ రే అధికార పరిధిలోకి వస్తుంది. దీంతో ఆయన ఈ ఘటనపై వివరాలు తెలుసుకోవడానికి గతవారం కాన్సస్ వెళ్లారు. గవర్నర్‌తోపాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జెఫ్ కొలియెర్, భారత సంతతి వ్యక్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత సంతతి వ్యక్తులకు ఎలాంటి సాయం కావాలన్నా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కాన్సస్ అధికారులు చెప్పారని రే వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా కాన్సస్ షూటింగ్‌లో భారతీయులను కాపాడటానికి ప్రయత్నించి గాయపడిన ఇయాన్ గ్రిలాట్‌ను కూడా రే కలిశారు. గ్రిలాట్ చాలా ధైర్యవంతుడని, మరో వ్యక్తి కోసం అతను బుల్లెట్‌కు ఎదురు నిలిచాడని రే కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa