ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత ఆ సినిమా చేయట్లేదు...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 01:40 AM

క్వీన్‌ బ్యూటీ సమంత ప్రస్తుతం తెలుగులో అంగీకరించిన చిత్రం రామ్‌ చరణ్‌-సుకుమార్‌ ల కాంబినేషన్‌ లో రూపొందే మూవీ మాత్రమే. త్వరలో షూటింగ్‌ ప్రారంభించు కుని.. సూపర్‌ స్పీడ్‌ లో ఫినిష్‌ చేసేలా షెడ్యూల్‌‌స ప్లానింగ్‌ చేశారు చెర్రీ అండ్‌ టీం. ఇప్పుడీ సినిమా నుంచి సమంత తప్పుకుందనే టాక్‌ వినిపిస్తోంది.
ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. సమంత ఈ నిర్ణయం తీసుకుందట. నిజానికి చైతు-శామ్‌ లు వచ్చే ఏడాది మధ్యలో పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే.. అఖిల్‌-శ్రేయా భూపాల్‌ ల ఎంగేజ్మెంట్‌ క్యాన్సిల్‌ కావడంతో.. ఇప్పుడు చైతు-సమంతల పెళ్లిని ముందుకు జరపాలని నిర్ణయించారు. సమంత కూడా అందుకే చెర్రీ సినిమాకి హ్యాండ్‌ ఇస్తోందని తెలుస్తోంది. అయితే.. పరిస్థితిని చెర్రీ సుక్కులకు వివరించిన శామ్‌.. తన పెళ్లి కారణంగా షెడ్యూల్‌‌స కి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉన్న విషయాన్ని వెల్లడించిందిట.
ఆమె సిట్యుయేషన్‌ ని గమనించి.. ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకునేందుకు సరే అని చెప్పారట సుక్కు అండ్‌ టీం. ప్రస్తుతం చెర్రీకి జోడీ వెతికే పని వేగం పుంజుకోగా.. చరణ్‌-సమంతల కాంబినేషన్‌ చూద్దామని భావించిన ఫ్యాన్‌‌సకి నిరుత్సాహం ఎదురైంది. గతంలో అనుపమా పరమేశ్వరన్‌ ను హీరోయిన్‌ గా ఫైనల్‌ చేసి.. ఆఖరి నిమిషంలో సమంతను తీసుకొచ్చాడు సుకుమార్‌. ఇప్పుడు ఈమె తనే స్వచ్ఛందంగా తప్పుకోవడంతో.. మరో పల్లెటూరి భామ వేట మొదలెట్టాల్సి వచ్చింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa