ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి ప్రసంగం తెలంగాణ టీడీపీకి పిడుగుపాటుగా మారింది. తెలంగాణలో ఇప్పటికే నామమాత్రంగా మిగిలిన క్యాడర్ బాబు వ్యాఖ్యలతో పూర్తిగా డీలా పడింది. అధ్యక్షుడే ఇలా మాట్లాడుతుంటే పార్టీని ఎలా బతికించుకునేదని టీడీపీ తెలంగాణ నేతలు మథనపడుతున్నారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలేవో చెప్పుకోకుండా అనవసరంగా తెలంగాణ ఏర్పాటు ప్రస్తావించడమేమిటని మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంటే తాను ఎంతబాధపడ్డాడో ఆయనే స్వయంగా చెప్పుకున్నాక ప్రజల వద్దకు ఏం ముఖం పెట్టుకొని వెళ్లగలమని తలలు పట్టుకుంటున్నారు. ఇక తమకు చెప్పడానికి ఏం మిగలలేదని వాపోతున్నారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో పలుచోట్ల ప్రజలు ముఖం మీదే ఈ విషయం నిలదీస్తుంటే టీటీడీపీ నేతలు నీళ్లు నమిలే పరిస్థితి ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa