ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 23, 2017, 04:38 PM

వేగంగా వెళ్తూ అదుపు తప్పిన ఓ లారీ ఏకంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన జిల్లాలోని గణపురం మండలం ల‌క్ష్మారెడ్డిప‌ల్లిలో జరిగింది. పరకాల - భూపాలపల్లి ప్రధాన రహదారిపై కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ.. డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి వీరగోని రవి ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో రవికి సంబంధించిన రేకుల షెడ్డు, కంపౌండ్ వాల్, కిరాణా షాపు షెడ్డు ధ్వంసం కాగా.. వీరగోని నందంకు చెందిన కాంపౌండ్ వాల్ పూర్తిగా ధ్వంసమయింది. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com