ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేటెడ్ పదవుల్లో మైనార్టీలకు పెద్ద పీట

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 12:29 PM

మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు ఆ వర్గాల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి తమ పట్ల ఏనాడూ ఏ పాలకులూ చూపించని ఆదరణ, అభిమానం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చూపుతున్నదని మైనారిటీలు భావిస్తున్నారు. గత రెండేండ్లుగా ఆయా రంగాల్లో మైనారిటీలు, ప్రత్యేకంగా ముస్లింలకు లభించిన ప్రాధాన్యం, గుర్తింపు, పదవులే దీనికి నిదర్శనమని వారు చెబుతున్నారు. రాజకీయ, నామినేటెడ్ పదవుల పంపకాల్లో తమకు పెద్దపీట వేయటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాష్ట్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు తమను ఓటు బ్యాంకుగానే చూశాయని మైనార్టీలు అంటున్నారు. తమకు దక్కాల్సిన గౌరవం, సముచిత స్థానాన్ని ఇవ్వకుండా గాలికొదిలేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీయేతరులను నియమించలేని రెండు మూడు సంస్థలకు, అక్కడక్కడా చిన్న పాటి సంస్థల్లో, పాలకవర్గాల్లో ఒకటి, రెండు పదవులు మైనారిటీలకు అప్పగించి చేతులు దులుపుకున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్, టీడీపీలు తమ విషయంలో ఎన్నడూ చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవంటున్నారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్వ పాలకులకు భిన్నంగా వ్యవహరిస్తూ తమను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa