మాడ్రిడ్: స్పానిష్ ఫుట్‌బాల్ స్టార్ టీమ్ రియల్ మాడ్రిడ్ ప్లేయర్స్ పంట పండింది. ఈ సీజన్లో ఈ టీమ్ పెద్దగా ఆడకపోయినా.. అందులోని ప్లేయర్స్ మాత్రం ఖరీదైన ఆడి కార్లను అందుకున్నారు. కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోకు మాత్రం ఇందులో నుంచే ఓ స్పెషల్ కారును ప్రజెంట్ చేశారు. రియల్ మాడ్రిడ్ టీమ్ స్పాన్సర్లలో ఆడి కూడా ఒకటి. తమ కంపెనీ లేటెస్ట్ మోడల్స్‌ను ఎప్పటికప్పుడు ప్లేయర్స్‌కు ఇస్తూనే ఉంటుంది. ఈ కొత్త కార్లు అందుకునే ముందు టీమ్ మెంబర్స్ అంతా ఫార్ములా ఈ రేసులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడి మాతృ సంస్థ అయిన జర్మన్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ స్పెయిన్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్కో పెరెజ్‌కు టీమ్ జెర్సీని అందించాడు రియల్ మాడ్రిడ్ ప్రెసిడెంట్ ఫ్లోరెంటినో పెరెజ్.