ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జింబాబ్వేకు కొత్త అధ్యక్షుడు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 04:37 PM

హరారే: జింబాబ్వే నూతన అధ్యక్షుడిగా ఎమర్సన్ మంగాంగ్వా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు దశాబ్ధాలు దేశాన్ని పాలించిన రాబర్ట్ ముగాబే రాజీనామా చేయడంతో ఎమర్సన్ ఇప్పుడు దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఎమర్సన్ గతంలో ఉపాధ్యక్షుడిగా చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే వరకు ఎమర్సన్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. హరారేలోని నేషనల్ స్పోర్ట్స్ స్టేడియంలో ప్రమాణస్వీకారోత్సం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇతర ఆఫ్రికా నేతలు హాజరయ్యారు. గతంలో ముగాబేకు కీలక సలహాదారుడిగా ఉన్న ఎమర్సన్ ఇప్పుడు అనేక సంస్కరణలు చేపడుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com