ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగమహల్ చౌరస్తా వద్ద వాహనాల దారి మళ్లింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 27, 2017, 07:52 AM

మెట్రో కారిడార్ 1,2 నిర్మాణ పనుల్లో భాగంగా రంగమహల్ చౌరస్తా నుంచి పుత్లీబౌలి వైపు వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లించారు. ఈ మార్గంలో వెళ్లే ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర పెద్ద వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మెట్రో రైలు పనుల నిమిత్తం రంగమహ ల్ చౌరస్తా వద్ద పనులు చేపడుతుండడంతో ఇక్క డి నుంచి పెద్ద వాహనాలు వెళ్లలేని విధంగా ఉం ది. దీంతో నగరంలోని రాజేంద్రనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఇతర మార్గాల మీదుగా మళ్లిస్తున్నారు. కోఠి నుంచి ఎంజీబీఎస్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వా హనాలు గతంలో మాదిరిగా ప్రయాణించవలసి ఉంటుంది. జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌కు చేరుకునే ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ పెద్ద వాహనాలు కూడా ఇదే మార్గంలో వెళ్లాలి.


ట్రాఫిక్ ఇబ్బందులు 


తలెత్తకుండా ఉండేందుకు..కోఠి, పుత్లీబౌలి, రంగమహల్ చౌరస్తాల మీదుగా నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. రంగమహల్ చౌరస్తా వద్ద జరుగుతున్న మెట్రో పనులతో రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో సిగ్నళ్ల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరుతున్నాయి. ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. సమీపంలోనే ఎంజీబీఎస్ కూడా ఉండడంతో జిల్లాలకు వెళ్లే, వచ్చే వాహనాలతో ట్రాఫిక్ నెలకొంటుంది. దీనిని అధిగమించేందుకుగాను అధికారులు ప్రత్యామ్నాయమార్గాల ద్వారా వెళ్లాలని సూచిస్తున్నారు.


బస్సులు ఇలా వెళ్లాలి : రాజేంద్రనగర్ నుంచి కోఠికి వచ్చే 94, 95 నెంబర్ సిటీ బస్సులు రంగమహల్ చౌరస్తా వద్ద పుత్లీబౌలి వైపు మళ్లకుండా చాదర్‌ఘాట్ చౌరస్తా, ఇసామియాబజార్, మహిళా కళాశాల, ఆంధ్రాబ్యాంక్ మీదుగా కోఠి మెడికల్ కాలేజ్ వద్దకు చేరుకోవాలి. ఉప్పల్ నుంచి కోఠికి వచ్చే సిటీ బస్సులు నింబోలిఅడ్డా వద్ద కుడివైపునకు మళ్లి టూరిస్ట్‌హోటల్, కాచిగూడ చౌరస్తా, బడీచౌడీ, డీఎంహెచ్‌ఎస్, ఆంధ్రాబ్యాంక్‌ల మీదుగా మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లాలి. ఆయా బస్సులు తిరుగు ప్రయాణంలో రంగమహల్ చౌరస్తా నుంచి వెళ్లవచ్చు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు కూడా ఇదే మార్గంలో వెళ్లాలి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com