ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ అదే ఆట తీరు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2017, 01:11 AM

-నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా
-పుజారా, అజింక్యా నిలబడ్డారు
-126 పరుగుల ఆధిక్యంలో భారత్‌

బెంగళూరు : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా బోర్డర్‌ అండ్‌ గవాస్కర్‌ పేటీఎమ్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ తడబడి నిలబడింది. తొలి ఇన్నింగ్‌‌సలో పేలవంగా ఆడి విమర్శలపాలైన భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్‌‌సలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. తొలి ఇన్నింగ్‌‌సలో టాప్‌ స్కోరర్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి భారత బ్యాటింగ్‌ను ఆదుకున్నాడు. అర్ధ సెంచరీతో రాణించిన రాహుల్‌ సహచరులతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ క్రమంలో రాహుల్‌ (51) రాణించగా, అభినవ్‌ ముకుంద్‌ (16), విరాట్‌ కోహ్లీ (15), రవీంద్ర జడేజా (2) విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా మిస్టర్‌ డిపెండబుల్‌‌స ఛటేశ్వర్‌ పుజారా (73), అజింక్యా రహానే (40) ఆసీస్‌ బౌలర్ల సహనాన్ని, సామర్థా్యన్ని పరీక్షించారు. వీరిద్దరినీ విడదీసేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ జట్టులోని బౌలర్లందర్నీ ప్రయోగించాడు. తొలి ఇన్నింగ్‌‌స హీరో నాథన్‌ లియాన్‌ కూడా ఎలాంటి ప్రభావమూ చూపలేకపోయాడు. దీంతో పుజారా, రహానే 203 బంతుల్లో 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత జట్టు 72 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. దీంతో 126 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్‌ మూడు వికెట్లతో రాణించగా, ఒకీఫ్‌ ఒక వికెట్‌ తీసి అతనికి సహకారం అందించాడు.


వరుసగా నాలుగో ఇన్నింగ్‌‌సలోనూ విఫలమైన కోహ్లీ
15 పరుగులకే అవుట్‌
భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి విఫలమై అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాడు. మంచి ఆధిక్యాన్ని సంపాదించాల్సిన స్థితిలో ఉన్న భారత జట్టును ఆదుకోవాల్సిన కోహ్లీ కేవలం 15 పరుగులకే హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్లూ్యగా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ మూడవ వికెట్‌ను కోల్పోయినట్లయింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్‌‌సలో సైతం కోహ్లీ 12 పరుగులకే అవుట్‌ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు తొలి టెస్టులోనూ స్వల్ప స్కోర్లకే కోహ్లీ వెనుదిరిగాడు.
హమ్మయ్య! ఆస్ట్రేలియాను ఆలౌట్‌ చేశారు!
జడేజా ఒకే ఓవర్‌లో వేడ్‌, లియాన్‌ వికెట్లను వరుసగా తీయడం, అంతకు ముందు స్టార్‌‌క వికెట్‌ను అశ్విన్‌ పడగొట్టడంతో బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు సోమవారం ఆస్ట్రేలియా జట్టు 276 పరుగులకు ఆలౌటై, తొలి ఇన్నింగ్‌‌సలో 87 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఆస్ట్రేలియా జట్టులో వార్నర్‌ 33, రెన్షా 60, స్మిత్‌ 8, మార్‌‌ష 66, హ్యాండ్‌‌సకోంబ్‌ 16, మార్‌‌ష 0, వేడ్‌ 40, స్టార్‌‌స 26, ఓకీఫే 4, లియాన్‌ 0, హాజిల్‌వుడ్‌ 1 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజాకు 6 వికెట్లు దక్కగా, అశ్విన్‌ 2, ఇషాంత్‌ శర్మ, యాదవ్‌లకు చెరి ఒక వికెట్‌ దక్కాయి.
బంతులు వేయడంలో అనిల్‌ కుంబ్లే రికార్డును బ్రేక్‌ చేసిన అశ్విన్‌
టీమిండియా చీఫ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే రికార్డును స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బ్రేక్‌ చేశాడు. గతంలో ఒక సీజన్‌లో అత్యధిక బంతులు సంధించిన బౌలర్‌ గా దిగ్గజ ఆటగాడు అనిల్‌ కుంబ్లే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2004-05 సీజన్‌లో కుంబ్లే 3,673 బంతులు ప్రత్యర్థులకు సంధించడం ద్వారా ఒక సీజన్‌లో అత్యధిక బంతులు సంధించిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డును అశ్విన్‌ తిరగరాశాడు. ఈ సీజన్‌లో అశ్విన్‌ మొత్తం 3,749 బంతులు సంధించాడు. తద్వారా కుంబ్లే రికార్డును బ్రేక్‌ చేసి, సరికొత్త రికార్డు నెలకొ ల్పాడు. ఒక సీజన్‌లో అత్యధిక బంతులు సంధించిన రికార్డులో టాప్‌ ఐదుగురు బౌలర్లు భారతీయులే కావడం విశేషం. వారిలో నంబర్‌ వన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, తరువాతి స్థానంలో కుంబ్లే ఉండగా, ఆ తరువాతి స్థానంలో వరుసగా వినూ మన్కడ్‌ (1952-53 సీజన్‌లో 3,662 బంతులు), దిలీప్‌ జోషి (1979- 80 సీజన్‌లో 3,515 బంతులు), రవీంద్ర జడేజా (2016-17 సీజన్‌లో 3469 బంతులు) తదితరులు ఉన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa