ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షరాపోవా నన్ను పెళ్లి చేసుకుంటావా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2017, 01:52 PM

ఇస్తాంబుల్: టెన్నిస్ సూపర్‌స్టార్ మారియా షరపోవా. ఆటతోపాటు అందంతోనూ అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ క్వీన్. డోపింగ్ టెస్ట్‌లో ఫెయిలై రెండేళ్ల నిషేధానికి గురైనా.. ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ రష్యన్ బ్యూటీకి ఓ వింత అనుభవం ఎదురైంది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో కూర్చున్న ఓ అభిమాని మ్యాచ్ మధ్యలోనే షరపోవా.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆ సమయంలో సర్వ్ చేయడానికి రెడీగా ఉన్న మారియా కూడా.. కాసేపు ఆపి సరే చూద్దాం అంటూ తలాడించింది. దీంతో గ్యాలరీ చప్పట్లతో మార్మోగింది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారిపోయింది. ప్రపంచం 161వ ర్యాంకర్ బుయుకాకేతో జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా 7-6, 6-0తో గెలిచింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com