హైదరాబాద్: దీర్ఘకాలికంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ చికిత్సలో భాగంగా హీమోడయాలసిస్ చేయించుకుంటున్న బాధితుల్లో అధికశాతం మంది హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని ఇటీవల వెల్లడైంది. దీనికి దేశంలో సరైన వైద్య విధానాలు, తగిన శిక్షణా పద్ధతులు లేకపోవడమే కారణమని తేలింది. మార్చి 9, వరల్‌డ కిడ్నీ డే సందర్భంగా సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ టికె షా మాట్లాడుతూ ఇటీవలికాలంలో సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో హెపటైటిస్ సి ఇన్షెక్షన్ల తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ఈ విషయంలో వరల్‌డ హెల్‌త ఆర్గనైజేషన్ ఆదేశాలను అన్ని ఆసుపత్రులు, హెల్‌తకేర్ సెంటర్లు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కాగా చికిత్సలో భాగంగా డయాలసిస్ చేయించుకుంటున్నవారు, ఇతర సర్జరీ సేవలు అందుకుంటున్నవారు హెపటైటిస్ సి బారిన పడుతున్న కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. అయితే అంతర్జాతీయ వైద్య నిబంధనలకు అనుగుణంగా ఇటీవలికాలంలో పలు చికిత్సలు కొనసాగుతుండడంతో ఇటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టాయన్నారు. రక్త పరీక్షలకు సంబంధించిన యాంటీ హెచ్‌సివి స్క్రీనింగ్ ఉత్పత్తులు పోస్‌ట- ట్రాన్‌సఫ్యూజన్ హెచ్‌సివి ఇన్ఫెక్షను సాధ్యమైనంత తక్కువయ్యేందుకు దోహదపడుతున్నాయన్నారు. 10 సంవత్సరాల క్రితం డయాలసిస్ బాధితుల్లో అధికంగా హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్లు 10 నుండి 20శాతం వరకూ కనిపించేవని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వైద్యవిధానాలతో ఇది 5శాతానికి తగ్గిందన్నారు. తాము డబ్ల్యహెచ్‌వో నిర్దేశించిన విధానాలు 100శాతం మేర పాటిస్తున్నప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో సరైన వైద్య విధానాలు లేని కారణంగా ఈ ముప్పు తప్పడం లేదన్నారు. ఈ విధంగా దేశంలోని కొన్ని వేలమంది బాధితులకు ప్రతీరోజూ డయాలసిస్ జరుగుతుంది. కాగా హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు విధివిధానాలను ప్రకటించింది. కాగా హెపటైసిస్ సి వైరస్ రక్తంలోకి ప్రవేశించినపుడు అది సుదీర్ఘకాలంలో కాలేయాన్ని దెబ్బతీసి, కాలేయ క్యాన్సర్‌కు దారితీస్తుంది. అయితే చాలామంది బాధితులకు దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో తగిన వైద్య సదుపాయాలు లేని ఆసుపత్రులలో చికత్స పొందుతూ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. హెపటైటిస్ సి అనేది వైరస్ రూపంలో ద్రవపదార్థాలు, ఇంజక్టబుల్‌స, బ్లడ్ ట్రాన్ఫూ్యసన్‌స మొదలైన మార్గాల్లో శరీరంలోకి ప్రవేశిస్తుంది.అందుకే ఈ విషయంలో బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa