ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలానగర్‌ మెట్రోస్టేషన్‌కు అంబేద్కర్‌ మెట్రోస్టేషన్‌గా పేరు మార్పిడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 03:49 PM

హైదరాబాద్‌: మియాపూర్‌-అమీర్‌పేటలో ఉన్న బాలానగర్‌ మెట్రోస్టేషన్‌కు హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు పేరు మార్పిడి చేశారు. ఈ మేరకు అంబేద్కర్‌ మెట్రో స్టేషన్‌గా అధికారులు నిర్ణయించారు. దళితుల ఐక్యవేదిక, పలు ప్రజా సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు బాలానగర్‌ మెట్రోస్టేషన్‌ పేరును అంబేద్కర్‌ మెట్రోస్టేషన్‌గా మారుస్తూ హెచ్‌ఎంఆర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివానంద్‌ నింబార్గి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం బాలానగర్‌ ప్రాంతం నుంచి మెట్రో స్టేషన్‌ మూడున్నర కిలీమీటర్ల దూరంలో ఉంది. భవిష్యత్తులో మెట్రోను విస్తరించినప్పుడు అయోమయానికి గురికాకుండా మెట్రోస్టేషన్‌ పేరును మార్చినట్లు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com