ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే గుజరాత్‌ తొలిదశ పోలింగ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2017, 08:26 AM

రాజకోట్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. శనివారం 89 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరుగుతుంది. ఈ దశలో చాలా మంది హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా పశ్చిమ రాజ్‌కోట్‌ స్థానం నుంచి గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంద్రనిల్‌ రాజ్‌యాగు రు ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. 1985 నుంచీ ఈ స్థానం బీజేపీకి కం చుకోటగా ఉంది. మణినగర్‌కు వెళ్లకుమందు 2002లో మోదీ ఇదే స్థానం నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు.


              కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగిన ఇంద్రనీల్‌ తూర్పు రాజ్‌కోట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయినప్పటికీ కుల సమీకరణాల్లో భాగంగా ఆయన్ని పశ్చిమ రాజ్‌కోట్‌కు మార్చారు. మరోవైపు, గుజరాత్‌లో కాంగ్రెస్‌ గెలుపొందితే సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ను సీఎంను చేస్తారనే తూర్పు సూరత్‌లో పోస్టర్లు చివరి రోజు ప్రచారంలో దర్శనమిచ్చాయి. ఇదిలా ఉండగా, తొలిదశ పోలింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌కు సంబంధించిన మరో శృంగార వీడియో కలకలం సృష్టించింది.


ఓ మహిళతో హార్దిక్‌, అతడి స్నేహితులు ఉన్నట్లుగా బుధవారం వెలుగులోకి వచ్చిన క్లిప్పింగ్‌ వైరల్‌ అయ్యింది. హార్దిక్‌కు వ్యతిరేకంగా గత నెలలో రెండు విడతలుగా వీడియోలు విడుదలైన విషయం విదితమే. వాటికి కొనసాగింపుగా ఈ మూడో సెట్‌ క్లిప్పింగ్‌ ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఐదు క్లిప్పింగ్‌లో... హార్దిక్‌తో పాటు ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఒక గదిలో ఉన్నారు. అయితే.. ఫేక్‌ వీడియోలను సృష్టిస్తూ బీజేపీ రాజకీయం చేస్తోందని పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కో కన్వీనర్‌ బంభానియా ఆరోపించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com