ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేవు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 01:06 AM

-మండలిలో తొలి ప్రశ్నగా అడిగిన శమంతకమణి
-దర్గా నిధులను రాబట్టండి  మహ్మద్‌ జాని
-రైతుల ఆత్మహత్యలు పెరిగాయి  ఉమ్మారెడ్డి
-పెద్దనోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింది  మంత్రి యనమల
-రైతులకు ఈ పాస్‌ పుస్తకాలు  ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి
-రైతుల ఆత్మహత్యలను తగ్గించాం : ప్రత్తిపాటి పుల్లారావు

అమరావతి, గుంటూరు, మేజర్‌న్యూస్‌ : నవ్యాంధ్రప్రదేశ్‌లో మంగళవారం జరిగిన శాసనమండలిలో విద్యార్ధులకు మౌలిక సదుపాయాలు లేవని టిడిపి సభ్యులు శమంతకమణి ప్రశ్నించారు. సొంత గడ్డపై మొదటి ప్రశ్నగా మండలిలో ప్రశ్నించే అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందన్నారు.   రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలో మరుగుదొడ్లు, నీటి సదుపాయం విషయంలో ప్రభుత్వ తీరు తాళం వేసితిని, గొళ్ళెం మరిచితిని అన్న చందంగా ఉందని టిడిపి సభ్యురాలు శమంతకమణి వాఖ్యానించారు. ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మిస్తోంది కాని వాటికి నీటి సరఫరా చేయటం లేదని, సబ్బు, డెట్టాల్‌తో కడగాలంటూ ప్రకటనలే తప్ప అందుకు అవసరమైన నీటిని సరఫరా చేయటం లేదని అన్నారు. దీనివలన విద్యార్ధులు రోగాల బారిన పడుతున్నారని ఆమె చెప్పారు. అవినీతి, అక్రమాలతో నీటి రవాణా జరుగుతోందన్నారు. ఆమెతోపాటు టిడిపికి చెందిన సభ్యుడు ఎంవీవీఎస్‌.మూర్తి మాట్లాడుతూ కార్పోరేట్‌ సంస్థలు గతంలో జిల్లా కేంద్రాల్లో ఉండేవని, నేడు మండలాలకు కూడా వచ్చాయని, తద్వారా ధనవంతుల పిల్లలు మా్తమ్రే చదువుకొంటూ పేద విద్యార్ధులు మా్త్రం ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొంటున్నారని, వారికి మౌలిక వసతుల కల్పన సక్రమంగా లేదన్నారు. కాంగ్రెస్‌ సభ్యురాలు రత్నాబాయి అడిగిన ప్రశ్నకు మంత్రి పల్లె సమాధానం ఇస్తూ మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా మహిళలకు అప్పగించనట్లు తెలిపారు. ఇందుకు గాను వారికి 2500 చెల్లిస్తున్నట్లు తెలిపారు. డైట్‌ ఛార్జీలు, మెయింటెనెన్‌‌స ఛార్జీలు ఇవ్వటం లేదని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అడగటంతో వాటిన్నంటినీ చెల్లించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి రఘునాధరెడ్డి చెప్పారు.
తెలంగాణ నుండి 72 కోట్లు రావాలి
 విశాఖపట్నంలోని హజరత్‌ ఇషాక్‌ మదాని ఆలీయా దర్గాకు తెలంగాణ నుంచి 72 కోట్లు రావాల్సి ఉందని ఎమ్మెల్సీ మహ్మద్‌ జాని అడిగిన ప్రశ్నకు మంత్రి పల్లె సమాధానం ఇచ్చారు. దర్గాకు సంబంధించి చరాస్తులు ఏమీ లేవని, దర్గాకు దేవద గ్రామంలో 5,307.81 ఎకరాల ఆస్తి ఉందని, 201112, 201516 కాలంలో దర్గా ఆస్తుల వల్ల 7,94,45.093 కోట్ల ఆదాయాన్ని పొందిందన్నారు. 201617లో దర్గా పునరుద్దరణ మరియు ఇతర సౌకర్యాల కోసం 1.25కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ భూములను 30 సంవత్సరాల కాలం కౌలుకు ఇచ్చేందుకు సిద్ధం చేశామన్నారు. ఈ ఏడాది నుంచి మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయిస్తామన్నారు.
రైతుల ఆత్మహత్యలు పెరిగాయి : ఉమ్మారెడ్డి
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, కానీ ప్రభుత్వం తపడు లెక్కలు చెబుతోందని వైయస్సార్‌సీపీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సభలో చెప్పారు. రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్న సహాయం ఏమిటని ప్రశ్నించారు. దీనికి తోడు రైతుల ఆత్మహత్యలను ఏ విధంగా గుర్తిస్తున్నారని ఆయన అడిగారు. ఇందుకు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానం ఇస్తూ రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం కƒట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని, రైతులు అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకున్నందువల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, త్రిసభ్య కమిటీ, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ద్వారా నిర్ధారించి వారికిసహాయం అందిస్తున్నామన్నారు. 2013 నాటికి రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ వర్తింపజేశామని, వడ్డీలేని రుణాలు, పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ, యాంత్రీకరణకు సహయం అందజేస్తున్నామన్నారు. 2015లో జాతీయ బ్యూరో నివేదికల ప్రకారం రాష్ట్రంలో 516 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు నమోదు అయ్యాయని, వీటిలో 19.5 శాతం సాగునీటి సమస్యల వల్ల 37.8 శాతం రుణ బాధల వల్ల, 41.8 శాతం కుటుంబ సమస్యలు, అనారోగ్యం, మత్తు మందుల వల్ల సంభవిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు స్వయంగా అనంతపురంలో రెయిన్‌గన్‌ల ద్వారా పంటలు వేయిస్తున్న సమయంలో వైపాకా కోర్టుకు వెళ్ళడంతో జాప్యం జరిగి సకాలంలో పంటలు పండలేదని, దానికి వారే బాధ్యత వహించాలన్నారు. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీని చెల్లించాలని టిడిపి సభ్యుడు పయ్యావుల కేశవ్‌ కోరగా, ప్రభుత్వ పరిశీలనలో ఈ అంశం ఉందని మంత్రి సమాధానం ఇచ్చారు. అలాగే కృష్ణా డెల్టాలో మినుము పంట వేసిన రైతులు నష్టపోయారని, వారికి కూడా సహాయం అందించాలని టిడిపి సభ్యులు వైబి.రాజేంద్రప్రసాద్‌, అన్నం సతీష్‌లు కోరారు.
పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింది  మంత్రి యనమల
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడంతో రాష్ట్ర ఆర్దిక పరిస్థితి దెబ్బతిందని, గతేడాది ఏప్రిల్‌ నుండి అక్టోబర్‌ వరకు 12 వృద్ధి రేటుగా ఉందని, 2015 ఏప్రిల్‌ నుండి 2017 ఫిబ్రవరి నాటికి 6.1 శాతానికి తగ్గిందన్నారు. టిడిపి సభ్యులు తొండపి జనార్ధన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పై సమాధానం చెప్పారు. అయితే పెద్దనోట్ల రద్దు వలన సామాన్య ప్రజలు కొంత ఇబ్బంది పడినప్పటికీ నల్లధనాన్ని అరికట్టడంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణ  బాగుంటుందని యనమల అన్నారు.  సీపీఐ సభ్యుడు పిజె చంద్రశేఖరరావు మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు అసలు లక్ష్యమేమిటో చెప్పాలని కోరారు. దీనిపై మండలి ఛైర్మన్‌ సమాధానం చెప్పకుండా విషయాన్ని దాటవేశారు.
రైతులకు ఈ పాస్‌ పుస్తకాలు ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి
 రాష్ట్రంలో రైతులకు పాస్‌ పుస్తకాల జారీలో జాప్యం జరుగుతోందని, క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఎమ్మెల్సీ ఆర్‌ రెడ్డెప్పరెడ్డి అడిగినప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సమాధానమిస్తూ రాష్ట్రంలో పాస్‌ పుస్తకాలకు బదులు, మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఈ పాస్‌ పుస్తకాలను జారీ చేస్తున్నామన్నారు. ఈ పుస్తకాల జారీలో కొన్ని కోర్టు వ్యవహారాల కారణంగా జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని, సీసీఎల్‌ఏ స్వయంగా ఈ పాస్‌ పుస్తకాల జారీని పర్యవేక్షిస్తున్నారని కృష్ణమూర్తి తెలిపారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa