టీ-20 క్రికెట్లో క్రిస్ గేల్ కొత్త రికార్డు సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మొనగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు టీ20 ఫార్మాట్లో విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ మొత్తం 800 సిక్సర్లు కొట్టాడు. భారీ షాట్లకు కేరాఫ్ అడ్రస్ అయిన గేల్.. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ప్రీమియర్ లీగ్‌లో విరుచుకుపడ్డాడు. రాంగ్పూర్ రైడర్స్ తరపున ఆడుతున్న గేల్.. కుల్నా టైటాన్స్‌పై కేవలం 51 బంతుల్లో 126 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ-20ల్లో 800 సిక్సర్లు కొట్టిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా గేల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత స్థానంలో మరో విండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ (506) ఉన్నాడు. గేల్ టీ-20 క్రికెట్లో ఇప్పటివరకు 19 సెంచరీలు చేశాడు. బ్రెండన్ మెకల్లమ్, లూక్ రైట్, మైఖేల్ క్లింగర్లు ఏడేసి సెంచరీలతో తర్వాత స్థానంలో ఉన్నారు.