ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంషాబాద్‌లో ఓ వ్యక్తి హల్‌చల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2017, 12:56 PM

రంగారెడ్డి : శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టు బావార్చి హోటల్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి హల్‌చల్ సృష్టించాడు. ఆ భవనం పైకెక్కిన వ్యక్తి.. కిందకు దూకుతానంటూ నానా హంగామా చేశాడు. దీంతో అక్కడున్న వారు అప్రమత్తమై భవనం పైకెక్కి అతడిని కాపాడేందుకు యత్నించారు. ఆ వ్యక్తి చేయి పట్టుకుని పైకి లాగేందుకు యత్నించినప్పటికీ.. కింది అంతస్తులోకి దూకేశాడు. కింది అంతస్తులో ఉన్న వ్యక్తులు.. అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ వ్యక్తి గత రాత్రి ఎయిర్‌పోర్టు రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ పోలీసు స్టేషన్ నుంచి ఆ వ్యక్తి తప్పించుకున్నాడు. మానసిక స్థితి సరిగ్గా లేకనే అతడు అలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు తెలిపారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com