తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (11.12.17) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధర శనివారం (డిసెంబర్ 9న) స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ గడిచిన మూడు నెలల్లో ఇదే కనిష్ట ధర కావడం విశేషం. డిసెంబర్ 2న రూ.28,070గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. డిసెంబర్ 8 నాటికి రూ.27,300కి చేరింది. దీనిపై శనివారం రూ.70 పెరిగి రూ.27,370 అయ్యింది. ఇదే ధర సోమవారం (డిసెంబర్ 11న) కూడా కొనసాగుతోంది. మరోవైపు గత నాలుగు రోజులుగా వెండి ధరలో ఎలాంటి మార్పులేదు.
గమనిక: ఆన్లైన్లో కేవలం బంగారం ధర మాత్రమే తెలియజేస్తారు. దీనిలో మజూరి, తరుగు వంటి అదనపు ధరలు ఇమిడి ఉండవు.