హైదరాబాద్ : ఎల్బీ నగర్ పరిధిలోని బైరామల్‌గూడలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బైకింగ్ ఫుడ్ బిస్కెట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో ఫ్యాక్టరీ పూర్తిగా కాలిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది.