శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని ఆశాయ్బాగ్లో రద్దు అయిన రూ. 1000, 500 నోట్లు భారీగా పట్టుబడ్డాయి. గత రాత్రి పోలీసులు తనిఖీలు చేయగా.. రూ. 13,63,500ల నగదు బయటపడింది. నగదు కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.