వైద్యఆరోగ్యశాఖలోని వైద్యవిద్య పరిధిలో 2108 పోస్టుల భర్తీకి ఫ్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ద్వారా పోస్టులు భర్తీ కానున్నాయని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు ఉత్త ర్వుల్లో పేర్కొన్నారు. భర్తీ చేయాల్సిన వాటిలో స్టాఫ్ నర్సు పోస్టులు 1,603 ఉండగా, వైద్యుల పోస్టులు ఒక్కటీ లేకపోవడం విశేషం. అనస్థీషియా టెక్నీషి యన్ (10), ఆడియో విజువల్/ మెట్రీ టెక్నీషియన్ (9), బయో మెడికల్ ఇంజనీర్ (2), బయో మెడికల్ టెక్నీషియన్ (2), చైల్డ్ సైకాలజిస్ట్ (9), సిటీ స్కాన్ టెక్నీషియన్ (4), డార్క్రూం అసిస్టెంట్ (26), డెంటల్ టెక్నీషియన్ (4), ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్/ఫిజియోథెరపిస్టు (2), ఈఈజీ
టెక్నీషియన్ (5), ఈసీజీ టెక్నీషియన్ (6), ఎలక్ట్రిక్ ఇంజనీర్/సూపర్వైజర్ (1), ఎపిడమాల జిస్ట్ కమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (2), జూనియర్ అసిస్టెంట్ (30), జూనియ ర్ బయోస్టాస్టిక్స్ ఆఫీసర్ (ఎంఆర్టీ) (1), జూనియర్ ఇంజనీర్ (1), జూని యర్ స్టెనో (3), ల్యాబ్ టెక్నీషియన్ (39), మెడికల్ రికార్డు క్లర్క్ (4), మెట ర్నిటీ అసిస్టెంట్ (15), ఫార్మసిస్ట్ గ్రేడ్-2 (58), ఫొటోగ్రాఫర్ (1), ఫిజి యోథెరపిస్ట్ (3), రేడియోగ్రాఫర్ (18), రేడియోగ్రఫీ టెక్నీషియన్ (9), రీఫ్రా క్షనిస్ట్/ఆప్టీషియన్ (3), రీహాబిలిటేషన్ అసిస్టెంట్ (2), స్పీచ్ థెరపిస్ట్ (5), స్టాఫ్ నర్సు (1603), స్టాటిస్టీషియన్ (3), స్టెరిలైజేషన్ టెక్నీషియన్ (1), స్టోర్ కీపర్ కమ్ రికార్డు క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (54) ఉన్నాయి.