ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్పొరేషన్లకు ప్రభుత్వ నిధులు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2017, 12:52 PM

హైదరాబాద్‌, సూర్య ప్రధానప్రతినిధి : రాష్ట్రంలోని మహానగరపాలక సంస్థ పరిధిలో నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలు మెరుగుపరిచేందుకు మున్సి పల్‌, ఐటి, పరిశ్రమలు, మైనింగ్‌, చేనేత,జౌళిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రత్యేక దృష్టిసారించారు. నగరాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు మెరుగుపరచాలని, అందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకో వాలని  మంత్రి ఆదేశించారు.  తెలంగాణలోని అన్ని కార్పోరేషన్లలో ప్రజలకు సరైన   రోడ్లు, మార్కెట్లు, టాయిలెట్లు, పార్కులు,బస్‌ బేలు, బస్‌ షెల్టర్లు, శ్మశాన వాటికల వంటి కనీస వసతుల కల్పనపైన దృష్టి సారించాలని కమీషన ర్లను ఆదేశించారు. మంగళవారంనాడు సచివాలయంలో రాష్ట్రంలోని కార్పో రేషన్ల కమీషనర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కార్పొరేషన్లకు  ఈ సారి బడ్జెట్‌లో ప్రత్యేకంగా కొంత నిధులను కేటాయిస్తామని మంత్రి తెలి పారు.  ప్రతి కార్పోరేషన్‌ పట్టణ విజన్‌ తయారు చేయాలని, ఈ విజన్‌ మేరకు దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాని మంత్రి అదికారులను కోరారు. నగరాల్లో నివసిస్తున్న ప్రజలకు ఏ మేరకు వసతులున్నాయి ఏలాంటి మౌలిక వసతులు కల్పించాలన్న అంశంపై  ముఖ్యమంత్రి  ప్రత్యేకంగా దృష్టి సారించి నట్లు మంత్రి తెలిపారు, సీఎం కేసీఆర్‌ అలోచనల మేరకు అభివృద్ది కార్య్ర మాలు చేపట్టాలన్నారు. ఇందుకోసం పట్టణంలో రోడ్ల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పట్టణ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రోడ్డు విస్తరణ పనులు  చేపట్టాలన్నారు. రోడ్డు సౌకర్యాలతోపాటు పట్టణాల్లో బస్‌ బేలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజావసరాల కోసం ప్రభుత్వ సంస్ధల భూమిని ఏలాంటి నోటీసు లేకుండా వినియోగించుకునేందుకు గతంలో ఇచ్చిన సర్య్కూలర్‌ ఉపయోగించుకుని బస్‌ బేల నిర్మాణం చేయాలన్నారు. ఈ బస్‌ బేలు, షెల్టర్లు సాద్యమైనంత అత్యాధునికంగా ఉండేలా ప్రయత్నించాలన్నారు. ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నప్పుడే పుట్‌ పాత్‌ ల నిర్మాణం చేపట్టలన్నారు. 


ఉగాదిలోగా ఓడీఎఫ్‌ :  పట్టణాల్లోని జనాభాకు అనుగుణంగా టాయిలెట్స్‌  నిర్మాణం జరగాలన్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ టాయిలెట్స్‌ తగినన్ని ఏర్పాటు చేయాలన్నారు. రొడ్ల పైన మూత్ర విసర్జనను అరికట్టేలా టాయిలెట్స్‌కు దారి, దూరం వంటి వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాలను ఒపెన్‌ ఢీపెకేషన్‌ ప్రీ చేసేందుకు ఉగాదిలోగా పెట్టుకున్న గడువు మేరకు పనిచేయాలన్నారు. ఈమేరకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపైన దృష్ట్టి సారిస్తూ మిషన్‌ మోడ్‌ లో పనిచేయాలన్నారు. పట్టణాల్లో శ్మశాన వాటికలను అభివృద్ది చేయాలన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ లోని మహాప్రస్థానం  స్థాయిలో ఉండాలన్నారు. పట్టణాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల  కార్యక్రమాలను  కలెక్టర్లతో కలసి సమన్వయం చేసుకోవా లన్నారు. పట్టణాల్లోని జనభా అవసరాల మేరకు మోడల్‌ మార్కెట్ల నిర్మాణం చేపట్టలన్నారు. కూరగాయాలకు(వెజ్‌), నాన్‌ వెజ్‌కు ప్రత్యేకంగా  మార్కెట్లు నిర్మాణం చేయాలన్నారు. మెకనైజ్డ్‌ కబేలాలు ఏర్పాటు చేయాలన్నారు. పారిశుద్యం కోసం కార్పోరేషన్లకు వాహనాలు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. పారిశుధ్ద్య నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. కమీషనర్లు ఉదయం 5 గంటలకే పారిశద్ద్య పనులను సమీక్షించాలన్నారు. పట్టణాల్లో అనధికారిక ప్లెక్సీలు, వాల్‌ రైటింగ్‌ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. కేసులు నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ చేయాలని అదేశించించారు.


పట్టణాల్లో ఏల్‌ ఈ డీ లైట్ల ఏర్పాటును పూర్తి చేయాలన్నారు. ఈ లైట్ల బిగింపు పక్రియను జరుగుతున్న తీరుని మంత్రి సమీక్షించారు. మరో మూడు కార్పోరేషన్లతో ఐదు రూపాయాల భోజన పథకాన్ని విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు అయా కార్పోరేషన్లలోని ప్రాంతాలను గుర్తించాలన్నారు.  కార్పోరేషన్ల ఔట్‌ సొర్సింగ్‌,కాంట్రాక్ట్‌ సిబ్బంది మేయర్లు, కార్పోరేటర్లు, ఇతర అధికారుల వద్ద పనిచేస్తున్న విషయం పలువురు సోషల్‌ మీడియాలో ప్రస్తావించిన విషయంపైన మంత్రి సీరియస్‌ అయ్యారు. ఇకపై ఎవరి వద్ద పనిచేసినా ఊరుకునేదిలేదని  కమీషనర్లను హెచ్చిరించారు. పురపాలికల నుంచి జీతం తీసుకునే ప్రతి ఉద్యోగి సంస్ధ కోసమే పనిచేయాలన్నారు. ఇలాంటి విషయంలో పిర్యాదు వస్తే కమీషనర్లపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com