ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పన్నీరు సెల్వం దీక్ష ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 01:20 PM

 చెన్నై: జయలలిత మృతిపై విచారణ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఒకరోజు నిరాహార దీక్షను ప్రారంభించారు. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో రాజరత్నం స్టేడియం బయట బుధవారం ఆయన దీక్షను ప్రారంభించారు.అంతకు ముందు మార్చి 1న పన్నీరు సెల్వంకు మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. జయలలిత మృతిపై విచారణ జరిపించాలని ఆయన్ని కోరారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ మైత్రేయన్‌ మాట్లాడుతూ జయలలిత మృతిపై ప్రజలకు సందేహాలు ఉన్నాయని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa