ఆధార్ పే యాప్‌ను బుధవారం ప్రభుత్వం లాంచ్ చేసింది. వినియోగదారులకు సరళమైన పద్దతుల్లో లావాదేవీలు చేసుకోవడానికి ప్రభుత్వ తెస్తున్న కొత్త టెక్నిక్‌లలో 'ఆధార్ పే' తాజాది. ఆధార్ పే యాప్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలను ఓ సారి చూద్దాం.
1. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌సీపీఐ), యూఐడీఏఐలు కలిసి ఆధార్ పే యాప్‌ను రూపొందించాయి.
2.బ్యాంకు ఖాతాలతో ఆధార్ నంబర్‌ను అనుసంధానిస్తేనే ఆధార్ పే యాప్‌ను వినియోగించడానికి వీలుకలుగుతుంది.
3. ఆధార్ పే ద్వారా చెల్లింపులు జరిపేందుకు సదరు వ్యక్తి వేలి ముద్ర(బయోమెట్రిక్ పద్దతి) ఇవ్వాల్సివుంటుంది.
4.ఆధార్ పేను వినియోగించడం వల్ల క్రెడిట్/డెబిట్ కార్డుల కంపెనీలకు చెల్లించాల్సిన మొత్తం ఆదా అవుతుంది.
5.యాప్‌ను వినియోగించేందుకు వినియోగదారునికి మొబైల్ ఉండాల్సిన అవసరం లేదు. వ్యాపారి మాత్రం మొబైల్‌ను కచ్చితంగా వినియోగించాలి.
6.ప్రస్తుతం రూ.10వేల వరకూ ఆధార్ పే ద్వారా లావాదేవీలు జరపొచ్చు.
7.కేవలం కొనుగోళ్లు జరపడానికి మాత్రమే ఆధార్ పే యాప్ ఉపయోగపడుతుంది. మనీ ట్రాన్స్‌ఫర్లను ఈ యాప్ ద్వారా నిర్వహించలేం.
8. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ పే యాప్, బయోమెట్రిక్ స్కానర్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని ఒకదానితో మరొకదాన్ని అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడు లావాదేవీ జరపడానికి వచ్చినప్పుడు వ్యక్తి ఆధార్ నంబర్‌ను ఆధార్ పే యాప్‌లో టైప్ చేసి బయోమెట్రిక్ స్కానర్‌లో ఫింగర్ ప్రింట్‌ను తీసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa