సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం చేరిన కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణ రావు ఇంకా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, బాలసౌరితో పాటు తమ పార్టీలోని పలువురు నేతలతో కలిసి ఆ ఆసుపత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. దాసరి ఆరోగ‍్య పరిస్థితిని గురించి జగన్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాసరి త‍్వరలోనే కోలుకోవాలని జగన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa