హైదరాబాద్: ఔత్సాహిక మహిళలు మరింతగా ముందుకు వచ్చి, స్టార్టప్ సంస్థలు పెట్టేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా స్మార్‌ట ఉమెన్ ఏంజెల్‌స నెట్‌వర్‌క (స్వాన్) ఆవిర్భవించింది. ఇండియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టీ-హబ్, యాంట్ హిల్ సంయుక్తంగా స్వాన్‌ను ప్రారంభించాయి. మహిళా సాధికారత పెంచడంతో పాటు ఉత్సాహం చూపించే మహిళలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలనూ ఈ సంస్థ అందించనుందని టీ హబ్ సీఈఓ జై కృష్ణన్ తెలిపారు. ఇండియాలో స్టార్టప్ సంస్థలు శరవేగంగా పెరుగుతూ ఉన్నాయని, వాటిల్లో మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందించాల్సి వుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వాన్ ప్రెసిడెంట్ క్రిస్టినా వెంచురా తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa