నందమూరి బాలకౄఎష్ణ 101వ చిత్రం ఓ కొలిక్కి వచ్చేట్టే ఉంది. ఈమధ్య చాలా కథలు విన్న బాలయ్య... అందులో ఓ కథని ఫిక్‌స చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ బాలయ్యకు ఓ కథ వినిపించారు. అది ఆయనకు బాగా నచ్చిందని, ఆ చిత్రంలో నటించడానికి పచ్చజెండా వూపారని తెలుస్తోంది. సి.కల్యాణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశాలున్నాయి. కథానాయికగా తమన్నా పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రెడ్డిగారు, జయసింహా అనే పేర్లు బయటకు వచ్చాయి. సింహా అనే టైటిల్ బాలయ్యకు బాగా కలిసొచ్చింది. రెడ్డిగారు.. కూడా కొత్తగానే అనిపిస్తోంది. మరి ఈ మూడింటిలో ఏది ఖరారు చేస్తారో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa