ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క ఛాన్‌‌స ఇవ్వమంటున్న తమన్నా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 02:44 AM

తమన్నా.. ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలో ఉన్న అగ్రహీరోయిన్లలో ఒకరు. అయితే, ఈ మిల్‌‌క బ్యూటీ బాలీవుడ్‌లో స్థిరపడాలని తెగ ట్రై చేస్తోంది. కానీ, అదౄఎష్టం కలిసిరావడం లేదు. లోగడ ఈ తెల్లపిల్ల నటించిన బాలీవుడ్‌ చిత్రం 'హిమ్మత్‌వాలా' బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. దీంతో ఈ అమ్మడుకి అవకాశాలు మొఖం చాటేశాయి. కానీ, తమన్నా మాత్రం బాలీవుడ్‌లో క్లిక్‌ అయ్యేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు.
 ఇందుకోసం బాలీవుడ్‌కు అనుగుణంగా తన సై్టల్‌ను మార్చుకుంది. బాలీవుడ్‌లో డ్రస్సింగ్‌కు అధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఈ విషయాన్ని గుర్తించి క్లీవేజ్‌ షోకి బాగానే ట్రై చేస్తోంది. హెయిర్‌ స్టయిల్‌ కూడా మార్చేసింది. మొత్తానికి తనను తాను పూర్తిగా మార్చుకున్నా అవకాశాలు మాత్రం రావడం లేదని తెగ బాధపడిపోతోందట.
 తమన్నా లేటెస్‌‌ట ఫోటోలు చూసిన వారందరూ తమన్నా అందం అదుర్‌‌స అంటున్నారట కానీ, నువ్వే మా హీరోయిన్‌వి అనడం లేదని మథనపడిపోతోందట. అంతేకాదండోయ్‌... దర్శకనిర్మాతలు కోరినట్టుగా అందాలను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa