ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుతుపవనాల టైంలో ఎల్‌నినో ఏర్పడకపోవచ్చు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 08:44 AM

సముద్రంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా సంభవించే ఎల్‌నినో రుతు పవనాల కాలంలో ఏర్పడకపోవచ్చు. ఎల్‌నినో వచ్చిందంటే వర్షాలు కురవవు. దేశంలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు రుతు పవనాల కాలం ఉంటుంది. ఈ సమయంలోనే 70 శాతం వర్షాలు కురుస్తాయి. జులై చివరి నాటికి ఎల్‌నినో ఏర్పడుతుందని, ఇది పంటలపై ప్రభావం చూపుతుందని తొలుత ఆస్ట్రేలియాకు చెందిన వాతావరణ విభాగం అంచనా వేసింది. భారత వాతావరణ విభాగంలోని సుదూర ప్రాంత అంచనాలను పరిశీలించే నిపుణులు మాత్రం ఆ ప్రమాదం లేదని చెబుతున్నారు. ఎల్‌నినో ఏడాది చివరిలో వచ్చే అవకాశం ఉందని, రుతు పవనాల కాలంలో ఏర్పడకపోవచ్చని చెబుతున్నారు. దీనిపై ఏప్రిల్‌, మే నెలల మధ్యలో మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa