స్వామి వివేకానంద జయంతి వేడుకలలో పాల్గొన్న ఎంపీ సీతారాం

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 12, 2018, 03:31 PM
 

మహబూబాబాద్ : స్వామి వివేకానంద 155వ జయంతి వేడుకలు మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా జరిగాయి. స్థానిక వివేకానంద సెంటర్‌లో వివేకానంద విగ్రహానికి టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. స్వామి వివేకానంద భారతదేశానికి నిరంతర స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. ప్రపంచంలో వస్తున్న మార్పులను వీక్షించిన తొలితరం భారతీయ యువతరంలో స్వామి వివేకానంద ఒకరు అని తెలిపారు. స్వామి వివేకానందను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ సీతారాం నాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


Telangana E-Paper