యువతలో నాలెడ్జ్ ఫోర్స్ తయారు చేయాలి : కొల్లు రవీంద్ర

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 12, 2018, 03:37 PM
 

విజయవాడ : యువతలో నాలెడ్జ్ ఫోర్స్ తయారు చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి  పేర్కొన్నారు. యువతతో నాలెడ్జ్‌ ఫోర్స్‌ను తయారుచేయాలన్నది సీఎం చంద్రబాబునాయుడు ఆలోచన అన్నారు. అంతేగాక క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివేకానందుడి జీవితం నేటి తరానికి స్ఫూర్తి అని, యువతను మంచి మార్గంలో నడిపేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.


Telangana E-Paper