హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 12, 2018, 03:49 PM
 

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నగర శివారు ప్రాంతమైన చెంగిచర్ల చౌరస్తాలో పెట్రోల్ ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి తీవ్రంగా గాయలయ్యాయి. మృతులను ఇంకా గుర్తించలేదు. పెట్రోల్‌ ట్యాంకర్‌ నుంచి అక్రమంగా పెట్రోల్ తీసేందుకు వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరినట్లు తెలుస్తోంది. ప్రమాదధాటికి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. భయంతో స్థానికులు పరుగులు తీస్తున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు అగ్నిమాపక యంత్రాలను పంపి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పెట్రోల్ ట్యాంకర్‌తో పాటు పలు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.


 గతంలో చర్లపల్లిలోని హెచ్‌పీ గ్యాస్ గోడౌన్‌లో  అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. భారీ శబ్ధంతో సిలిండర్లు పేలాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది అతి కష్టంమ్మీద ఆరు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. ముందు జాగ్రత్త చర్యగా తొలుత చుట్టుపక్కలవారిని అధికారులు ఖాళీ చేయించారు. సమీపంలోని కంపెనీలను మూసివేయించారు. అటుగా రైళ్లు వెళ్లకుండా ఆపేశారు.