వర్షాలు పడకపోయినా కాళేశ్వరం ద్వారా నీరిస్తాం :మంత్రి హరీశ్‌

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 12, 2018, 04:55 PM
 

వర్షాలు పడకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుకు నీరిస్తామని మంత్రి హరీశ్‌ తెలిపారు. కాగా, ఇవాళ మహబూబాబాద్‌ జిల్లా కురవిలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రతి రోజు రెండు లక్షల సిమెంట్‌ బసతాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు వినియోగిస్తున్నామన్నారు. డోర్నకల్‌లో లక్షా 10 వేల ఎకరాలకు నీరందిస్తామని, ఎస్సారెస్పీ స్టేజ్‌ -1, స్టేజ్‌ – 2 ద్వారా ఉమ్మడి వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం పంటకు పెట్టుబడి పథకం కింద రైతులకు ఇవ్వనున్న నగదును చెక్కుల రూపంలో ఇస్తామని తెలిపారు. కాగా, ఇవాళ మహబూబాబాద్‌ జిల్లా కురవిలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మోబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల పేరుతో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పరన్నారు.