శంషాబాద్‌ విమానాశ్రయంలో హైఅలర్ట్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 09:40 AM
 

శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తుండడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రధాన ద్వారాల వద్ద శుక్రవారం నుంచి వాహనాల తనిఖీలను ముమ్మరం చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయంలో ఈ నెల 31 వరకు సందర్శకుల పాసులను నిలిపివేశారు. విమాన ప్రయాణికులను క్షుణ్నంగా తనిఖీ చేసిన తరువాతనే లోపలికి అనుమతిస్తున్నారు. సీఐసీఎఫ్‌, సైబరాబాద్‌ పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్వా్కడ్‌, ఇంటెలిజెన్స్‌ అధికారులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. అనుమానాస్పదంగా ఎవరైనా విమానాశ్రయం పరిసరాల్లో తచ్చాడితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Telangana E-Paper