పవన్ కల్యాణ్‌కు ఓయూ జేఏసీ హెచ్చరిక

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 11:23 AM
 

కత్తి మహేశ్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య సోషల్ మీడియా, టీవీల వేదికగా జరుగుతున్న వార్ లోకి ఓయూ జేఏసీ కూడా ఎంట్రీ ఇచ్చింది. కత్తి మహేశ్ కు సపోర్ట్ గా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ను హెచ్చరించారు ఓయూ జేఏసీ నేతలు. పవన్ కల్యాణ్ అభిమానులు కొందరు కత్తి మహేశ్ ను బెదిరిస్తుండటం పట్ల ఓయూ జేఏసీ తీవ్రంగా స్పందించింది. కత్తి మహేశ్ ను చంపుతాం, నరుకుతాం అనడాన్ని జేఏసీ ఆక్షేపించింది. పవన్ కల్యాణ్ అభిమానులు అలాంటి మాటలు మానుకోవాని జేఏసీ సూచించింది. ఒకవేళ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గనుక కత్తి మహేశ్ పై దాడికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జేఏసీ హెచ్చరించింది.


పవన్ కల్యాణ్ అభిమానులు కత్తి మహేశ్ పై దాడికి పాల్పడితే.. పవన్ కల్యాణ్ సినిమాలను తెలంగాణ పరిధిలో ఆడనివ్వమని జేఏసీ ప్రకటించింది. పవన్ కల్యాణ్ ను తెలంగాణలో తిరగనిచ్చేది కూడా లేదని జేఏసీ పేర్కొంది.ఇప్పటికే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు , కత్తి మహేశ్ కు మధ్య జరుగుతున్న రచ్చ రసవత్తరంగా సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జేఏసీ కూడా ఈ రచ్చలోకి ఎంటర్ కావడం మరింత ఆసక్తిదాయకం. కత్తి మహేశ్ కు సపోర్ట్ గా జేఏసీ స్పందించింది. పవన్ కల్యాణ్ కే డైరెక్టుగా హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ విషయంలో పవన్ కల్యాణ్ అభిమానగణం ఎలా స్పందిస్తుందో!


Telangana E-Paper