హెచ్‌సీఏలో అక్రమాలపై విచారణ జరపాలి: అజారుద్దీన్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 12:19 PM
 

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విచారణ జరపాలని భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... హెచ్‌సీఏ పాలకవర్గం హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు. చదువుకున్న వ్యక్తులు కూడా ఈ విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. అలాగే హెచ్‌సీఏ లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయడం లేదన్నారు. హెచ్‌సీఏ పాలకవర్గం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్ పేర్కొన్నారు.