అదృశ్యమైన హెలికాప్టర్‌కు ప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 03:02 PM
 

ముంబై: ముంబై తీరప్రాంతంలో అదృశ్యమైన పవన్ హన్స్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్‌కు సంబంధించిన ఓ శకలాన్ని కోస్ట్‌గార్డు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో సీనియర్ ఓన్‌జీసీ అధికారి సహా ముగ్గురు సిబ్బంది మృతిచెందినట్టు సమాచారం. ముంబై తీర ప్రాంతంలోని జుహు ఎయిర్‌పోర్టు నుంచి పవన్ హాన్స్ (డూఫిన్ ఏఎస్ 365 ఎన్3- వీటీ పీడబ్ల్యూఏ) హెలికాప్టర్‌ శనివారం ఉదయం 10.20 గంటల సమయంలో బయల్దేరింది. అయితే హెలికాప్టర్‌‌ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. అదృశ్యమైన హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్లు సహా ఏడుగురు ఉండగా, వారిలో ఐదుగురు ఓఎన్‌జీసీ సిబ్బంది ఉన్నారు. హెలికాప్టర్ శకలంతో పాటు సీనియర్ ఓఎన్‌జీసీ అధికారి సహా ముగ్గురి సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. కాగా, మిగతా సిబ్బంది కోసం భారత నేవీ సిబ్బంది, కోస్ట్‌గార్డు గాలింపు చర్యలను వేగవంతం చేశాయి. 


Telangana E-Paper