ఐనవోలులో ప్రారంభమైన మల్లన్న బ్రహ్మోత్సవాలు

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 14, 2018, 08:58 AM
 

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే వరంగల్ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు తెల్లావారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు, సిబ్బంది, కమిటీ సభ్యులు కాషాయ రంగు జెండాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపురానికి జెండాలను కట్టి జాతర ప్రారంభమైనట్టు తెలిపారు. జాతరకు రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఆదివారం నుంచి మూడోరోజులపాటు హన్మకొండ, వరంగల్ బస్టాండ్ల నుంచి సుమారుగా 100 బస్సులను ఆర్టీసీ నడుపనున్నది.


Telangana E-Paper