సైకిల్ పై వెళ్తుండగా ఢీకొట్టిన బైకు

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 14, 2018, 12:12 PM
 

మహబూబాబాద్ రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బయ్యారం పెత్తాళ్లగడ్డ రహదారి మీదుగా సైకిల్ పై వెళ్తున్న గీత కార్మికుడు బోడపట్ల యెర్రయ్య (50)ను బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో యెర్రయ్య అక్కడికక్కడే మృతి చెందారు.